PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హంద్రీనీవా …కేసి కాలువకు నీటి విడుదల…

1 min read

– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ చొరవతో సాగునీటి విడుదల.

– ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల.

– మల్యాల ఎత్తిపోతల ద్వారా 674 క్యూసెక్కులు విడుదల.

– కృష్ణా జలాలను పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్థర్.

– హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ రైతన్నలు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నంద్యాల  జిల్లా  నందికొట్కూరు మండలం  మల్యాల ఎత్తిపోతల  హంద్రీనీవా సుజల స్రవంతి పథకం  నుంచి కేసి కాలువకు, హంద్రీనీవా కాలువకు  నీటి విడుదలను జలవనరులశాఖ అధికారులు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రావడంతో బుధవారం సాయంత్రం 5.20 నిమిషాలకు నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూర్ ఆర్థర్  రెండు పంపు ద్వారా కేసి కాలువకు నీటి విడుదల ప్రారంభించారు.ముందుగా  కేసి కాలువకు సాగునీరు విడుదల చేయాలని మల్యాల పంపు హజ్ వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆందోళన చేపట్టడంతో ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు ,నందికొట్కూరు సిఐ విజయ భాస్కర్ ,హుటాహుటిన మల్యాల ఎత్తిపోతల వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు..సాగునీరు విడుదల చేసేవరకు అక్కడినుంచి కదిలేది లేదని ఖరాఖండిగా అధికారులను హెచ్చరించారు.నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ,నీటి పారుదల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో స్పందించిన అధికారులు నీటి విడుదల చేశారు.  ఎంత వరకు నీటి మట్టం ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ కేసి కాలువకు ,హంద్రీనీవా కాలువకు రెండు పంపుల ద్వారా హంద్రీనీవా కాలువకు 700 క్యూసెక్కుల నీటిని కర్నూలు,నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లా ప్రజల  సాగు తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  అన్నదాతల సంక్షేమమే  ద్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.హంద్రీనీవా ద్వారా కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని రైతులకు సాగు తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేయడం జరుగుతుందన్నారు.శ్రీశైలం జలాశయంలో 863 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే హంద్రీనీవా నుంచి నీటి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఏడాది హంద్రీనీవా నుంచి 40 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. సకాలంలో రైతులకు సాగునీరు విడుదల చేయడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  నందికొట్కూరు మండల నాయకులు  ఉండవల్లి ధర్మారెడ్డి  నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిలర్  జాకీర్ హుస్సేన్ , వైసీపీ నాయకులు  తమ్మడపల్లి విక్టర్ ,విశ్రాంత పోలీసు అధికారి  పెరుమాళ్ళ జాన్, బ్రాహ్మణకొట్కూరు యువ నాయకులు  ఉదయ్ కిరణ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు  చంటి గారి దిలీప్ రాజ్ , జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , జూపాడు బంగ్లా మండల నాయకులు  జంగాల పెద్దన్న, శాతనకోట వెంకటేశ్వర్లు, బిజినవేముల మహేష్, బాలకృష్ణ, మల్యాల శంకరయ్య, కొనిదెల నవీన్, భాస్కర్ రెడ్డి, దామగట్ల రత్నమయ్య, సంజన్న, ప్రాతకోట వెంకటరెడ్డి, నెహ్రు నగర్ శ్రీనాథరెడ్డి, పాలమర్రి రాజు, జీవో 98 నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నందికొట్కూరు మండలంలోని రైతు సోదరులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author