PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ జీ తెలుగులో ఆగస్ట్ 21న జగద్ధాత్రి సీరియల్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్తో, భిన్నమైన సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న  ‘జగద్ధాత్రి’ అంటూ మరో కొత్త సీరియల్ తో మీ ముందుకు రాబోతోంది. దీప్తి మన్నె – దర్శి చంద్రప్ప ప్రధాన పాత్రలలో నటించిన ‘జగద్ధాత్రి’ ఈ నెల 21 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానుంది. ‘జగధాత్రి’ అనే ప్రధాన పాత్ర, మహిళా సీక్రెట్ ఏజెంట్ చుట్టూ ముడిపడిన పరిస్థితులే ఈ సీరియల్: కథ. ఈ సీరియల్ అసాధారణమైన కథాంశంతో ఊహించని మలుపులతో ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. జగధాత్రి (దీప్తి మన్నె) తన మిత్రుడు కేదార్ (దర్శ్ చంద్రప్పు) తో కలిసి సీక్రెట్ ఏజెంట్స్ గా పనిచేస్తారు. కుటుంబంలో పెద్ద కుమార్తెగా, బాధ్యతల మధ్య సమతుల్యతను కలిగి ఉన్న జగద్ధాత్రి ప్రయాణమే ఈ కథ. దివ్యాంగుల పాఠశాలను నిర్వహిస్తూ ఓ స్త్రీగా సమాజంలో ఆటుపోటులను సమర్థంగా ఎదుర్కొంటూనే అన్యాయం, అక్రమాలను వ్యతిరేకించే సమయంలో అపరకాళిలా తన విశ్వరూపం చూపిస్తుంది జగద్దాత్రి రాధమ్మ కూతురుగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దీప్తి మన్నె, నూతన నటుడు దర్శ చంద్రప్ప ఈ సీరియల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రీతీ శ్రీనివాస్ కీలక పాత్రలో కనపడనున్నారు.ఈ సీరియల్ ప్రారంభం సందర్భంగా ఆగస్టు 17న ఘనంగా జరిగిన మీడియా సమావేశంలో నటీనటులు దీప్తి మన్నె, దర్శ చంద్రప్ప ప్రీతీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సీరియల్ గురించి నటి దీప్తి మన్నె మాట్లాడుతూ, ” జగద్దాత్రిగా మీ ముందుకు రావాడానికి నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ కథ విన్నప్పుడు ఇలాంటి ఓ పవర్ ఫుల్ రోల్లో నన్ను నేను ఊహించుకుని చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఇదొక ఒక సీక్రెట్ ఏజెంట్ కథ మాత్రమే కాదు, ఒక మహిళ తన గతం, తన కుటుంబం. తన వృత్తిని సమన్వయం చేసుకుంటూ జీవిస్తూనే అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించే అద్భుతమైన కథ. ఇలాంటి పాత్రలో మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది” అన్నారు.ఈ సీరియల్ కథ, ప్రత్యేకత గురించి జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్- అనురాధ గూడూరు మాట్లాడుతూ సమాజంలో ఆదర్శవంతమైన మహిళగా జీవిస్తూనే సత్యాన్వేషణ సాగిస్తూ న్యాయంకోసం పాటుపడే ఓ శక్తివంతమైన మహిళ కథగా ఈ సీరియల్ మీ ముందుకు రానుంది..ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే సున్నితమైన అంశాలను స్పృశిస్తూ, భావోద్వేగాల సమ్మేళనంగా సాగే ఓ చక్కని కథ జగద్దాత్రి, ఇలాంటి అద్భుతమైన కథను ప్రతి విషయంలోనూ ఉన్నతంగా మలిచేందుకు నటీనటులు, నిర్మాణ, దర్శకబృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు. మా ప్రతి సీరియల్ని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటిలానే ఈ సీరియల్ని కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

About Author