దళితులు మేధావులపై జరుగుతున్నదాడులపై కెవిపిఎస్ ధ్వజం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కెవిపిఎస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో గిత్తరి రమేష్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులు మేధావులపై జరుగుతున్న దాడులపై కెవిపిఎస్ నాయకులు ధ్వజమెత్తారు. రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత ప్రజాసంఘాలైన DHPS, MRPS, దళిత సమైక్య, డప్పు కళాకారుల సంఘం, చర్మకార వృత్తిదారుల సంఘం, కాటికాపర్ల బేగార్ల సంఘం, ఆల్ ఇండియా లాయర్లు యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు మరియు ముఖ్యమైన వ్యక్తులు మేధావులు పాల్గొని దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాల మీద గల మెత్తారు.ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి MD ఆనంద్ బాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, DHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాసు, MRPS రాష్ట్ర నాయకులు సుభాష్ చంద్ర , ఆల్ ఇండియా లాయర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు కాశీ విశ్వనాథ్ , అడ్వకేట్ రవి , తుగ్గలి మండలం CPM పార్టీ కార్యదర్శి శ్రీరాములు , కాటికాపరి గుంతలు తీసే బేగార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ పాల్గొని ప్రసంగించారు. సమాజంలో మనిషి పుట్టిన మొదలుకొని నేటి వరకు దళితులు అంటరాని వారుగా చూడబడుతూ, వివక్షతకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం మనుషులంతా ఒక్కటే అని చెప్పినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోలో, పట్టణ ప్రాంతాల్లో కూడా వివక్షతను, దాడులను దౌర్జన్యాలను హత్యలు అత్యాచారాలను పాలకవర్గాలు పెంచి పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల దళితులపై మేధావులపై దళిత సంఘాల నాయకులపై పలుచోట్ల దాడులు అత్యాచారాలు వివక్షతలు చోటు చేసుకున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు కోకోళ్ళలుగా మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి అని అన్నారు. దేశంలో బిజెపి మతోన్మాద శక్తులు మనువాదాన్ని మరియు మను ధర్మశాస్త్రాన్ని కొనసాగించాలని భారత రాజ్యాంగాన్ని నిర్మూలించాలని, సమూలంగా నాశనం చేయాలని ఒక దురుద్దేశమైన ఆలోచనతో దళితులలో చీలికలను తీసుకొస్తూూ, వారిని మతోన్మాద శక్తుల వైపు నడిపిస్తూూ, మానవతా విలువలు తిలోదకాలు ఇచ్చి, మతపరమైన విద్వేశాలను వారి మెదడులో నాటుతూ, BJP యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనంగా మణిపూర్లో జరిగినటువంటి ఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. మతం పరంగా క్రైస్తవుల మీద దాడి జరిగినట్టే ఉందని, అలాగే అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఒక దుర్మార్గమైన కుట్రను పన్నారనేది అర్థమవుతుందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిమీద తన వైఖరిని తేల్చకుండా బిజెపి మతోన్మాద శక్తులకు తలోగ్గి మానవతా విలువలను మంట కలుపుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడగకపోతే, మన ఉనికిని కోల్పోతామని వారు ధ్వజమెత్తారు. అలాగే మన రాష్ట్రంలో దళితులకు ఇదివరకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను రద్దుచేసి, దళితులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టి వేశారనిి అన్నారు. దళితుల ఉనికిని చాటుకోవడానికి దళిత రక్షణ యాత్రను కొనసాగిస్తున్నాము. కాబట్టి ఈ దళిత రక్షణ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలను లేవనెత్తి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలిసి వచ్చే దళిత, గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిిిిత సంఘాల జిల్లాా నాయకులు రాముడు , పత్తికొండ మండలం MRPS అధ్యక్షులు ముత్యాల ఈశ్వరయ్య , దళిత సమైక్య నాయకులు శీను , కారప్ప , ఆల్ ఇండియా లాయర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీ విశ్వనాథ్ , అడ్వకేట్ రవి , చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు కోలంట నాగరాజు, కాటికాపరి గుంతలు తీసే బేగార్ల సంఘం అధ్యక్షులు కృష్ణ , ప్రజానాట్యమండలి పత్తికొండ మండల కార్యదర్శి రమేష్ , తుగ్గలి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి శ్రీరాములు , మద్దికేర మండలం సిఐటియు నాయకులు బురజుల రాముడు , కెవిపిఎస్ పత్తికొండ మండల అధ్యక్షులు సురేందర్ , గుంతలు తీసే బేజారుల సంఘం నాయకులు రామాంజనేయులు , పెద్ద నెట్టికల్లు , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసన్న తదితరులు పాల్గొన్నారు,