స్కిల్ అప్ గ్రేడేషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 24 నుండి 46 వ వార్డ్ సచివాలయములోని సచివాలయ కార్యదర్శులకు నాల్గోవ బ్యాచ్ తేది: 14.08.2023 నుండి 17.08.2023 వరకు స్కిల్ అప్ గ్రేడేశన్ శిక్షణను గురువారము పూర్తీ చేయడం జరిగినది. వీరికి డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ అంశాలపై మరియు సర్వీసు రూల్స్ కండక్ట్ రూల్స్ ల అంశాలపై విస్తృతంగా శిక్షణ ఇవ్వడం జరిగినది. నాల్గోవ బ్యాచ్ శిక్షణ పూర్తియిన సందర్భంగా నగర పాలక సంస్థ మేనేజర్ ఎన్.చిన్న రాముడు వారిను అభినందిస్తూ శిక్షణ ద్రువికరణ పత్రములను అందజేశారు. మరియు సచివాలయమునకు వచ్చు ప్రతి వ్యక్తితో మర్యాదపుర్వంగా నడిచుకోవలసినదిగా వారి పనిని తక్షనముగా చేయవలసినదిగా తెలుపడమైనది. ప్రభుత్వము వారు సచివాలయ వ్యవస్థను క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నతంగా తీర్చిదిద్దుటకు ఆనేక చర్యలు తీసుకుంటుందని తెలిపినారు మరియు ప్రతి సచివాలయ ఉద్యోగ క్రమ శిక్షనను పాటించవలసినదిగ నగర పాలక సంస్థ మేనేజర్ ఎన్. చిన్న రాముడు తెలిపినారు. ఈ కార్యక్రమములో రెవిన్యూ ఆఫీసర్ కె.యం డి. జునీద్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ మరియు రికార్డు అసిస్టెంట్లు నరేంద్ర , నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా, సీతారామ నగర, నియర్ వాటర్ పంప్ హౌస్ దగ్గర (కర్నూలు) జరిగినది.