ఇళ్ళ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయండి
1 min readఇళ్ళ నిర్మాణం లో పురోగతి చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం
టెలి కాన్ఫరెన్స్ లో ఎంపిడిఓ లు, హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.జి..సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు :పునాది స్థాయి కంటే కింద ఉన్న ఇళ్ళ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పైకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా జి సృజన ఎంపిడివో లను ఆదేశించారు.గురువారం ఉదయం మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపీడీఓ లు, హౌసింగ్ ఇంజనీర్లు, ఎం ఈ ఓ లు తదితరులతో హౌసింగ్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఉపాధిహామీ తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాల ప్రగతి లో అధికారులు ఆశించినంత ప్రగతి చూపించడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. కృష్ణగిరి, చిప్పగిరి, వెల్దుర్తి, కౌతాళం, కర్నూల్ అర్బన్, కల్లూరు, పత్తికొండ,మంత్రాలయం, తుగ్గలి, కోసిగి, ఎమ్మిగనూరు మండలాల్లో 50 కంటే పైగా బిలో బేస్మెంట్ ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని వీటిని ఈ నెలాఖరులోపు బేస్ మెంట్ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.. ఎంపీడివో లు, హౌసింగ్ ఏ ఈ లు సమీక్షించుకుని పురోగతి చూపేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు..ఈ అంశంపై పర్యవేక్షణ చేయాలని హౌసింగ్ పిడిని ఆదేశించారు.బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లిషన్ స్థాయి ఇళ్ళ నిర్మాణాల్లో ఒక్క స్టేజి కన్వర్షన్ కూడా చేయలేదని కోడుమూరు, కర్నూలు అర్బన్, వెల్దుర్తి, హాల్హర్వి, ఆదోని అర్బన్ మండలాల హౌసింగ్ ఏఈలను ప్రశ్నించారు.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం లో నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ నిర్మాణాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, మండల స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. చిప్పగిరి మండలం డేగణహల్ గ్రామంలో ఇళ్లు నిర్మించుకుంటున్న 20 మంది లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ ద్వారా ఇచ్చే అడ్వాన్స్ రూ.20 వేలు మంజూరు కాలేదనే విషయం తెలిసినప్పటికీ హౌసింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ దృష్టికి రావడం తో విధుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన చిప్పగిరి ఎంపిడిఓ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో ని అదేశించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేనందున హౌసింగ్ కి సంబంధించిన పురోగతి లేదని కృష్ణగిరి ఎఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అలాంటి సమయాల్లో వారి లాగిన్ తీసుకొని వర్క్ ఇన్స్పెక్టర్ల ద్వారా పనిచేయించాలి గాని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేరని పురోగతి లేదని చెప్పడం ఏంటని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నెల 25 నాటికి రాష్ట్రం వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు పూర్తి లో భాగంగా మన జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, 25వ తేదీ తర్వాత 100 శాతం కంటే తక్కువ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 25వ తేదీన అన్ని లేఔట్లలో పూర్తిచేసిన ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.విద్య శాఖ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కి సంబంధించి వాలంటీర్ ల ద్వారా చేపడుతున్న 5 నుండి 18 ఏళ్ల విద్యార్థుల సర్వే 97 శాతమే పూర్తి అయిందని, మిగిలింది కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కువగా పెండింగ్ ఉన్న కర్నూల్ అర్బన్, మంత్రాలయం తదితర మండలాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ వెంకట నారాయణ, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ఏ పివో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.