PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలకు సర్వం సిద్ధం… డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్..

1 min read

– 03 సర్పంచ్, 21 వార్డులకు జరగనున్న ఎన్నికలు..

– పోలింగ్ సిబ్బందికి ఎన్నికలపై శిక్షణ తరగతులు పూర్తి..

పల్లెవెలుగు వెబ్​  ఏలూరు జిల్లా :  గత స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత ఏర్పడిన సర్పంచ్, వార్డు మెంబెర్స్ ఖాళీలను పూరించడానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు  ఎన్నికలను సజావుగా జరుపడానికి అన్నీ చర్యలు చేపట్టమని జిల్లా పంచాయతీ అధికారి & ఎడిషనల్ జిల్లా ఎన్నికల అధికారం తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లాలో ఈ నెల ఆగష్టు 19న 3 సర్పంచులకు, 21 వార్డు సభ్యులకు సంభందించి ఎన్నికలు జరగనున్నాయని డిపిఓ అన్నారు.  33 పోలింగ్ కేంద్రంలో జరగనున్న ఎన్నికలలో 11114 మంది ఓటు హక్కు వినియోగించు కొనున్నారని వీరిలో పురుషులు 5444 కాగా 5670 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు. ఎన్నికలు జరగనున్న సమస్యత్మక ప్రాంతాలలో పోలీస్ బందో బస్ పెంచడమే కాకుండా మైక్రో పరిశీలకులని నియమించామని జరగనున్న ఎన్నికలలో సుమారు 160 సిబ్బందిని వినియోగించనున్నామని డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుందని ఓటర్లు తప్పనిసరిగా తమ గుర్తిపు కార్డును ఎన్నికల పరిశీలకులకు చూపించాలని అన్నారు. ఇప్పటికే ఓటరు చీటీలను ప్రతి ఓటరుకు పంచడం జరిగిందని, ఎన్నికలు సజావుగా జరగడానికి 48 గంటలు ముందే ప్రచారం ముగించాలని, మద్యం దుకాణాలు ముసివేయాలని, ఎటువంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా పోలీస్ పహార ఉంటుందని డిపిఓ అన్నారు. ఇప్పటికే పోలింగ్ సంబందించిన సామాగ్రి మండల కేంద్రానికి చేరిందని ఎన్నికల ప్రవర్తన నియమావలిని సక్రమంగా అమలు చేస్తున్నామని, రెవిన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సహకారంతో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరుపడానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచనలతో అన్నీ చర్యలు చేపట్టామని డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్.

About Author