రాష్ట్రస్థాయి ఆట్యా..పాట్యా పోటీలలో జిల్లా జెట్టు విజయం సాధించాలి
1 min readప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఈనెల 18 ,19వ తేదీలలో జరగనున్న ఎనిమిదవ రాష్ట్రస్థాయి ఆట్యా..పాట్యా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు విజయం సాధించాలని ప్రముఖ గ్యాస్తో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు . నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఆట్యా..పాట్యా సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మన దేశం డెమోక్రసీ, డెమోగ్రఫి, డైవర్సిటీకి ప్రతిరూపమని వివరించారు. మన దేశ జనాభాలో యువత అధిక శాతం ఉండడం వల్ల రానున్న రోజుల్లో ప్రపంచాన్ని మన దేశం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశంతో పోలిస్తే విదేశాలలో యువత చాలా తక్కువగా ఉన్నారని, మన దేశ ఉజ్వల భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ,మానసిక ఆరోగ్యము మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పట్టుదల, క్రమశిక్షణ ఏకగ్రత పెంపుందుతాయని వివరించారు. విద్యార్థులను తల్లిదండ్రులు క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువులో రాణిస్తూ దేశానికి ఉపయోగపడే సైనికులుగా ఎదుగుతారని ఆయన వెల్లడించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల దేహదారుడ్యాం పెంపొందించడంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణిస్తారని వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, అదే వారు చదువులో క్రీడల్లో పాల్గొంటే మానసిక ధైర్యం పెరిగి అలాంటి నిర్ణయాలకు దూరంగా ఉంటారని అన్నారు. క్రీడాకారులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, అప్పుడే క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ వివరించారు.