PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 25.. 26న జరిగే మహాసభలు జయప్రదం చేయండి

1 min read

హోళగుంద మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నందు ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ మాట్లాడుతూ_* రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వీడాలి.ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 28 నుండి 1వ తేదీ వరకు బీహార్ లోని బెగుసరై జిల్లాలో జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర నిర్మాణ మహాసభలు నెల్లూరులో సెప్టెంబర్ 13 14 వ తేదీన జరుగుతాయి. అదేవిధంగా కర్నూల్ నగరంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలు ఎస్టియు భవనం నందు ఈ నెల  25,26 వ తేదీన జరుగుతున్నాయి. కావున దేశవ్యాప్తంగా హై స్కూల్ హాస్టల్ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల మండల నియోజవర్గ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నిర్మాణం బలోపితం చేసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల కొరకు పోరాటాలకు విద్యార్థులను సంసిద్ధం చేయడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలంతో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొని వచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం వలన పేద మధ్య బడుగు బలహీన అనుగారిన వర్గాల విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష వలె మారుతుంది. జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై పోరాటాలకు సిద్ధం అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు కల్పించడంలో పూర్తిగా విప్లమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే విద్యావ్యవస్థ మెరుగవుతుంది. పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందుతుంది. విద్య ఉపాధి పేరుతో మోడీ ఓట్లు వేసిన విద్యార్థులను యువకులను మోసం చేస్తున్నారు. కేంద్రంతో పోటీపడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మోదీ మెప్పుకోసం కేంద్రం దగ్గర మోకరిల్లి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి  పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే చట్టాలు తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా జీవో నెంబర్ 107 108 తీసుకొని వచ్చి మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారారు. జీవో నెంబర్ 77 తీసుకుని వచ్చి పీజీ విద్యార్థులకు పై చదువులు దూరం చేశారు. అమ్మబడి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన అంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,స్కాలర్షిప్లు మౌలిక వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు. నాడు నేడు పేరుతో పాఠశాలలో అభివృద్ధి పేరుతో దోచుకుంటున్న వైసిపి నాయకులు. మెగా డీఎస్సీ నిర్వహించకపోవడం. యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తు. డిగ్రీని పాత పద్ధతిలో నిర్వహించాలన్న డిమాండు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణకు చట్టం తీసుకొని రావాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్య ఉపాధిలో పూర్తిగా విఫలమైంది. రానున్న రోజుల్లో దీన్ని ఎండగడుతూ భవిష్యత్తు కార్యచరణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలియడం జరిగింది. భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శలు  మల్లి అజయ్ ఏఐఎస్ఎఫ్ మండల ఉపఅధ్యక్షుడు రాజు ఏఐఎస్ఎఫ్  నాయకులు గాది ఉరుకుంద ఈశ్వర్ యశ్వంత్ అశోక్ విద్యార్థులు ఇమ్రాన్ భాష మహబూబ్ బాషా నాగరాజ్ వీరేష్ పవన్ రాజ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author