PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న పాలనలోనే రాజ్యం సుభిక్షం

1 min read

హెబ్బటం గ్రామంలో గడప గడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

ప్రజలు, నాయకులు మంత్రి గుమ్మనూరుకి అపూర్వ స్వాగతం పలికారు

జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల గ్రామంలో 1200 మందికి లబ్ధి పొందారు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  జగనన్న పాలనలోనే రాజ్యం సుభిక్షమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం  పేర్కొన్నారు. శుక్రవారం హోళగుంద మండలం హెబ్బటం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తప్పెట్లు, శాలువా, బాణసంచా పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి గ్రామ సచివాలయ సేవలను గూర్చి ఆరా తీశారు. సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి.పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్టీరు రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.మంత్రివర్యులు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటిస్తూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై మంత్రి  ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. హెబ్బటం గ్రామంలో  సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ. 23 కోట్ల 40 లక్షలు అర్హులైన వారకి లబ్ధి చేకూరిందన్నారు. గ్రామ సచివాలయం నిధులతో  మౌలిక సదుపాయాల కొరకు డ్రైనేజీ, రోడ్లు, పనులు కొరకు ప్రణాళికలు సిద్ధంచేసిపనులు ప్రారంభించాలన్నారు. గ్రామంలో నాడు నేడు ద్వారా నూతన అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

About Author