ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన పోచిమి రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆగస్టు 15 తేదీన సందర్భంగా, “జగనన్నకు తోడుగా అక్క చెల్లెమ్మలకు అండగా” అనే స్ఫూర్తితో స్థానిక కోచింగ్ రెడ్డి సేవా సంస్థ నాలుగో బ్యాచ్ కుట్టు శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. పోచిమిరెడ్డి సేవాదళ్ వ్యవస్థాపకులు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉచిత కొట్టు మిషను శిబిరాన్ని మహిళలు విరివిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో MPTC దేవరగట్టు లక్ష్మి, వార్డు మెంబర్లు లైట్ నాగరాజు, బోడా సావిత్రి ,మాజీ ఉప సర్పంచ్ కె. కోటేశ్వరరావు, గోవింద రాజు, మాజీ ఎంపీటీసీ గణపతి , చక్కరాళ్ల కాంత రెడ్డి, పులికొండ రామానాయుడు ,కుట్టు శిక్షణ తీసుకునే 200 మంది మహిళలు పాల్గొన్నారు.