PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి వారం ఫ్రైడే – డ్రైడే  పాటించండి, జీవితకాలం ఆరోగ్యంగా ఉండండి..

1 min read

అసిస్టెంట్ మలేరియ అధికారి జె గోవిందరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గo పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం ప్రస్తుత వర్షాకాల కారణంగా ఫ్రైడే – ఫ్రైడే కార్యక్రమంలో దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ మరియు సీజనల్ వ్యాధుల నివారణ , తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు అవగాహన చేస్తూ పురవీధుల్లో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ఆధ్వర్యంలో ఎంపీహెచ్ఓ కృష్ణారావు సమక్షంలో పిహెచ్ సి సిబ్బందితో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ లో మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిపై జాగ్రత్తలు వ్యాధి లక్షణాలను వివరించారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి మనిషి కంటి కదలికలో నొప్పి ,శరీరo పై దద్దుర్లు, తలనొప్పి ,తీవ్ర జ్వరo, కండరాలు, కీళ్లు నొప్పులు లక్షలాల కనిపిస్తాయని తెలిపారు. పై లక్షణాలు కనిపిస్తే సమీప ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని మాక్ ఎలిసా పరీక్ష ఒక్కటే డెంగ్యూ నిర్ధారణకు ఖచ్చితమైన పరీక్ష అన్నారు. ఈ పరీక్ష జిల్లా కేంద్ర ఆస్పత్రి ఏలూరు నందు మరియు ఏరియా ఆసుపత్రి జంగారెడ్డిగూడెం నందు నూజివీడు ఆసుపత్రి నందు ఈ సదుపాయం ఉందని తెలిపారు. ఈ పరీక్ష ఏ రుసుము తీసుకోకుండా  ఉచితంగా నిర్ధారణ చేస్తారని తెలిపారు. దోమలు కలిగే ప్రదేశాలు. మన ఇంటి పరిసరాల్లో వాడి పడవేసిన కొబ్బరి బొండాలలో, చెట్నీలు కారప్పొడ్లు దంచుకునే రుబ్బురోలు పోత్రాలలో,  కొద్దిపాటి నీరు నిల్వ ఉండే తొట్లలో, వాడని ప్లాస్టిక్ బకెట్లలో, ద్విచక్ర వాహనాల టైర్లలో, పాడైన మట్టి కుండలో, మన ఇంట్లో వాడుకునే విఫరిజేటర్, వాటర్ ఎయిర్ కండిషన్ లో ఉండే వాటర్ బాక్సులలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు చేరి గుడ్లు పెట్టి అవి వ్యాప్తి చెంది మన నివసించే ప్రదేశాలలో ఉండి మనల్ని దోమ కుట్టడం వలన డెంగు వ్యాధి వస్తుందని  తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు నీటి నిలవలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం లేదా ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రైడే పాటించడం మంచిదని సూచించారు. దోమతెరలు వాడటం, ఇంటి కిటికీలు తలుపులకు జాలీలు బిగించుకోవడం, ఇంటి బయట లోపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం మన ఆరోగ్యానికి ఉత్తమ మార్గ మని. అలాగే ప్రతివారం ఫ్రైడే – డ్రైడే  పాటించటం వల్ల జీవితకాలం ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసు, హనుమంతు, సత్యనారాయణ, ఎం ఎల్ హెచ్ పి హీనా మరియు ఆశా వర్కర్లు శివపార్వతి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

About Author