ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలే : సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈ రోజు(శనివారం)రోజున జరిగే వార్డు ఎన్నికల్లో ఎవరైనా సరే అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు పట్టణ సీఐ విజయ భాస్కర్ అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం పైపాలెం గ్రామంలో జరిగే ఐదవ వార్డు ఎన్నికలు ఉన్నందున పోలింగ్ జరిగే మండల పరిషత్ పాఠశాలను సీఐ పరిశీలించారు.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ ఉంటుందని పోలింగ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మీకు ఉన్న ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అన్నారు.అదేవిధంగా పాఠశాలల జరిగే పోలింగ్ గురించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి సిబ్బందికి సీఐ తెలియజేశారు.ఈరోజు పైపాలెం,అలగనూరు గ్రామాలలో వార్డు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ఈ పోలింగ్ కు గ్రామాల్లో పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది చెన్నయ్య,నాగన్న,బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.