ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం : ఐసా సేవా సంస్థ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు యువజన సేవా సంస్థ (AYSA)* తరపున ఉచిత గుండె వైద్య శిబిరం శనివారం ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరం ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు, మక్కా మసీదు దగ్గర, యాసీన్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు కిమ్స్ హాస్పిటల్ లోని కార్డియాలజీ విభాగానికి చెందిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ అన్నపూర్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మెడికల్ క్యాంపులో ఉచిత కన్సల్టేషన్ ద్వారా రోగులకు బిపి , షుగర్,ECG, 2D ECO స్కానింగ్లు పరీక్షలు ఉచితంగా చేశారు..దాదాపు 81 మందికి పైగా ఈ క్యాంప్ సందర్శించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆత్మకూరు యువజన సేవా సంస్థ* ( AYSA) సభ్యులు మాట్లాడుతూ యువత అందరూ ఏకమై భవిష్యత్ లో కుల, మత బేధం లేకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులతో పాటు సేవా సంస్థ నిర్వాహకులు , పట్టణ ప్రజలు పాల్గొన్నారు.