పట్టణ ముస్లింల స్మశాన వాటికకు ప్రభుత్వ భూమి కేటాయించండి
1 min read– ముస్లింలకు ఇబ్బందిగా మారినా ఖబరస్తాన్ సమస్యను పరిష్కరించండి.
– జాతీయ రహదారి విస్తరణలో కేజీ రోడ్డులో రైతులు పొలాలు కోల్పోయారు.
– రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయండి.
-జిల్లా కలెక్టర్ మనజీర్ జీలాని సామున్ కు పలు విన్నవించిన కౌన్సిలర్ నాయబ్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని జగన్న కాలనీ మరియు సచివాలయాల పరిశీలకు శనివారం విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జీలాని సామూన్ ను మున్సిపల్ కౌన్సిలర్ నాయబ్ కలిసి పలు సమస్యలను ప్రస్తావించారు.ఈ సందర్భంగా నాయబ్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా ముస్లింలు మరణిస్తే ఖననం చేయడానికి ఖబరస్తాన్ లో స్థలం చాలడం లేదని అన్నారు.చాలీచాలని ఖబరస్థాన్ లో ఖననం చేయడానికి ముస్లింలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.కావున 4 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి చేయాల్సిందిగా కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా జాతీయ రహదారి విస్తరణలో పొలాలు ఇచ్చిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.ఆత్మకూరులో ఒక ఎకరాకు రూ.80 లక్షల నుండి 90 లక్షల వరకు నష్ట పరిహారం ఇచ్చారని కాని నందికొట్కూరులో ఎకరాకు 9 లక్షల నుండి 12 లక్షలు మాత్రమే ఒక ఎకరకు ఇచ్చారని పొలాలు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.తక్షణమే రైతులకు న్యాయబద్ధంగా నష్టపరిహారాన్ని కేటాయించాలని కలెక్టర్ కు కౌన్సిలర్ నాయబ్ విన్నవించారు.స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఎమ్మార్వో మరియు మున్సిపల్ కమిషనర్ లకు ఆదేశించారు.