PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలి..

1 min read

– కలెక్టర్ కు  పిర్యాదు చేసిన విద్యార్థి సంఘం నాయకులు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం విద్యా శాఖ అధికారిణి ఫైజున్నిసా బేగం ను సస్పెండ్ చేయాలని శనివారంజిల్లా కలెక్టర్ మంజిర్ జిలాని సామాన్ కు  ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డక్క కుమార్ మాట్లాడుతూ పాఠశాలలు తెరచి మూడు నెలలు అవుతున్న  నందికొట్కూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా నడుపుతున్నారని తెలిపారు. కొన్ని విద్యా సంస్థలు రేకుల షెడ్లలో  నడుపుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేకుల షెడ్లలో విద్యను అందించారదని జీవో ఉన్న కూడా   ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడుపుతున్న ఏ మాత్రం పట్టించుకోకుండా ఎంఇఓ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు . అదేవిధంగా గుర్తింపు లేకపోయినా విద్యా సంస్థను నడుపుతున్నారు . నందికొట్కూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్  కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యా సంస్థను నడుపుతున్నారని పేర్కొన్నారు . రేకుల షేడ్లలో విద్యను బోధించడం ద్వారా కాలాన్ని బట్టి విపరీతమైన ఇబ్బంది కి విద్యను అభ్యసించడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు.  నందికొట్కూరు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి జగనన్న కిట్ల లో నాణ్యత లేకపోవడం  కింది స్థాయి లో విద్యార్థులకు అందకపోవడం జరుగుతుందన్నారు .జగనన్న రాగిజావ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వా  పాఠశాలలలో సక్రమంగా అందడం లేదన్నారు . మండల వ్యాప్తంగా విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం  ప్రైవేట్ కార్పొరేటర్ దోపిడిని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్, ఉపాధ్యక్షుడు హర్ష, నవీన్, రాజు పాల్గొన్నారు.

About Author