మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న యువతకు రక్షణ కల్పించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ పరిధిలో అభివృద్ది శూన్యం అని మనకందరికీ తెలిసిన విషయమేనని, ఎటువంటి అభివృద్దికి నోచుకోని పత్తికొండ నియోజకవర్గంలో నేడు యువత చెడు అలవాట్లకు బానిసలై వారి భవిష్యత్తును నాశనం చేసుకునే దుస్థితి ఏర్పడిందని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు అన్నారు. శనివారం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో 18 నుండి 40 ఏళ్ల లోపు 90వేల దాకా యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో నిరుద్యోగ యువత మత్తు పదార్థాలకు బానిసలు అయ్యే పరిస్తితి ఏర్పడిందని తెలిపారు. స్థానికంగా అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి, అలాగే ప్రతి డాబాలలో, పాన్ సెంటర్లలో, కూల్ డ్రింక్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, ఈ మధ్య కాలంలో గంజాయి మొదలగు మత్తు పదార్థాలు ఎక్కువ అవ్వగా మట్కా జూదం కూడా ఎక్కువ అయ్యి యువత వారి భవిష్యత్తు కోల్పోయే దుస్తితి చోటు చేస్తుందని అన్నారు. ఆర్డీఓ, DSP లాంటి డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలు ఉండి ఇలాంటి పరిస్థితులు నియోజకవర్గంలో నెలకొంటే యువతకు రక్షణ ఏది, ఎవరి బాధ్యత..?? అని ప్రశ్నించారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే వారు యువత బాగోగులు కూడా ఆలోచన చేయాలని కోరారు. లేనియెడల తామే స్వయంగా రానున్న రోజుల్లో వీటిపై అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించి ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.