పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
1 min readగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి
తానేటి వనిత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందుతున్నాయని, ఇది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 123వ రోజు పర్యటన కొవ్వూరు టౌన్ 21వార్డు అచ్చాయమ్మ కాలనీలో శనివారం సాయంత్రం ఆమె పర్యటించారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు లబ్ది చేకూరిందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు