ఊరు.. ‘తోట’లా మారాలి
1 min readపల్లెవెలుగు వెబ్, బనగానపల్లె : నియోజకవర్గంలోని అవుకు మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన తోట నరసింహం ప్రతి ఇంటికి మొక్కను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ జగదీశ్వర రెడ్డి చేతుల మీదుగా మెట్టుపల్లి గ్రామ ప్రజలకు మొక్కలు అందజేశారు. నరసింహాం గారి ఇంటి పేరు తోట ఉండటంతో.. ఊరంతా పచ్చటి తోరణాలతో తోట(వనం)లా మారాలని ఆకాంక్షించారు. కరోన కష్టకాలంలో సహజసిద్ధమైన ఆక్సిజన్ అందక ఎందరో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన నరసింహం.. భావితరాలకు మంచి ఆక్సిజన్ సప్లై చేసేలా మొక్కలను వృద్ధి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించాలని సూచించారు.