వర్షం కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వర్షం కురవాలని గ్రామదేవతలకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజించి, జలంతో అభిషేఖించారు.పత్తికొండ మండలం J.అగ్రహారం గ్రామంలో వర్షం రాక,కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని,ఈ పరిస్థితుల నుండి బయట పడాలంటే వర్షాల కోసం గ్రామ దేవతలను నిష్టగా పూజిస్తూ,జలాభిషేకం చేశారు. మొదటగా గ్రామంలోని ఈశ్వరాలయం, ఆంజనేయ స్వామి, సుంకులమ్మ, బీరప్ప స్వామి, మసీదుల్లో దేవత విగ్రహాలను జలంతో అభిషేకం చేసి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రాతికి మరియు సుంకులమ్మ దేవతకు 101 కడవలతో గ్రామంలోని యువకులు జలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో చిన్న మునిస్వామి కురువ చెన్నకేశవులు, దిడికట్ల నవీన్, పూజారి కౌలుట్లయ్య, బొరుసు రంజిత్ కుమార్, అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ సేవకులు దేవదాసు కాశన్న తదితరులు పాల్గొన్నారు.