అలరించిన సంగీత విభావరి…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిజ శ్రావణమాసం నాగుల చవితి సందర్భంగా గోదాగోకులం కర్నూలు నందు ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ వాస్తవ్యులు కుమారి బుర్రా హేమమాలిని గాత్రానికి సహకార వాయిద్యాలు వాయులీనపై కుమారి బుర్రా రాధశ్రీ లాస్య, మృదంగం బి.సుధాకర్ అందించారు. త్యాగరాజు కృతులు,అన్నమయ్య కృతులతో పాటు, రామదాసు కృతులను ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్ట్ పల్లెర్ల నాగరాజు, గోదా పరివారం పాలాది సుబ్రహ్మణ్యం, బాల సుధాకర్, జనార్ధన, వెంకటకృష్ణ ,చిత్రాల వీరయ్య, వేముల రవి, మాకం శ్రీనివాస్ ,తల్లం సురేష్ , రాజు , శ్రీనాథ్ , మహిళలు లలిత , సునీత , వేదవతి , శైలజ మరియు ప్రముఖులు ఆవోపా నాగేశ్వరరావు , బజరంగదళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాపరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు బిర్రు ప్రతాప్ రెడ్డి, ఆర్.సురేశ్, శ్రీమహాలక్ష్మి, పసుపులేటి నీలిమ, బి.శ్రీరాములు,దాసరి రామచంద్రారెడ్డి, డాక్టర్ రఘునాథరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.