PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

1 min read

– ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్థానిక యల్లమ్మ దేవాలయంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు , అలాగే మండల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బిసి, మైనార్టీల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు, అదేవిధంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో, ఎస్సీ హాస్టల్ నందు సన్రైజ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమ్యత రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో, విద్యార్థులకు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు, అనంతరం లారెన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ కరీముల్లా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, మండలంలోని బలసింగన పల్లి లో కె.వి.రమణారెడ్డి, సౌ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు, అలాగే మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే జన్మదిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు, ఈ క్రమంలో మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, కమలాపురం నియోజకవర్గ మైనార్టీ నాయకులు, అన్వర్ భాష, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, వైయస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.

About Author