PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జీవో 117 ను రద్దు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : రీ అపోర్షనేట్  కు సంబంధించి గతం లో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు 117 మరియు 128 లను ఉపసంహరించుకోవాలని  రాజ్యసభ సభ్యులు శ్రీ వి విజయసాయి రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి యస్. బాలాజీ లు  కోరారు. ఆ వుత్తర్వులు ఆధారంగా పని సర్దుబాటు చేయడం తగదని, ఇప్పటికే వారానికి 40 పీరియడ్లు బోధిస్తూ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని, గతంలో 24 నుండి 30 పీరియడ్లు బోధించేవారని మిగిలిన  పిరియడ్ లు పాఠ్యప్రణాళికలు తయారీ, టిఎల్ఎం తయారీకి ఉపయోగపడేవని, ఉపాధ్యాయుల మానసిక స్థితిని సమతౌల్యం చేయడానికి గతం లో  సమయసారిని లో 30 పీరియడ్లు మించకుండా విద్యాబోధన చేసేటట్లు చూసే వారని,  విద్యావ్యవస్థ లో పనిగంటలు లెక్క కాదని, పనిగంటలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులను వేధించడం తగదని, బోధన తగిన స్వేచ్ఛతో జరగాలని,  విద్యార్థులకు స్వచ్ఛమైన విద్యా అందించే స్వేచ్ఛ ఉపాధ్యాయునికి ఇవ్వాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడంలేదని వారు తెలిపారు . జూన్ లో బదిలీలు చేసి సాఫీగా జరగాల్సినటువంటి విద్యాసంవత్సరం ను మరలా  పని సర్దుబాటు  పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, బదిలీ పొంది పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులు జీతాలు అందుకోకుండానే పని సర్దుబాటు గురి అవుతున్నారని, గతంలో ఇచ్చిన 117 వ జీవో ప్రకారం సెక్షన్లు నిర్వచనం సరిగా లేదని హై స్కూలు, ప్రీ హై స్కూలు లలో ప్రతి తరగతి ని ఒక సెక్షన్ గా భావించి సబ్జెక్టుకు ఒక టీచర్ తప్పనిసరిగా ఇవ్వాలని, విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ నియమకాలు జరగాలని వారుకోరారు. పని సర్దుబాటు పేరుతో ఇబ్బందులు పెట్టడం తగదని, పని సర్దుబాటు ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ల తర్వాత మిగిలిన ఖాళీలను స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామన్నారని, ఇంతవరకు ప్రమోషన్ ప్రక్రియ చేపట్టలేదని, కోర్టు ఆటంకాలు ఉంటే తొలగించి ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రస్తుత బదిలీలలో రిలీవర్ రాక నిన్న రిలీవైన వారిని తిరిగి పాత పాఠశాలలో విధులు  నిర్వహించాలని అనడం సరికాదని, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడం ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం వల్ల ఇక పని సర్దుబాటు ప్రక్రియ అవసరముండదని తక్షణం  పని సర్దుబాటును నిలిపివేయాలని  వారువిజ్ఞప్తి చేశారు.

About Author