ఏపీ లో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రక్షాళన చేయాలి..
1 min read– లిడ్ క్యాప్ ఎండి పై వస్తున్న ఆరోపణను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
– ఏపీ అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆంద్రప్రదేశ్ లో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రక్షాళన చేయాలని ఆంధ్ర ప్రదేశ్ దళిత సేవా వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్ఞువరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. లిడ్ క్యాప్ ఎం డి దోలా.శంకర్ పై వస్తున్న ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి ఆ విచారణలో ఆరోపణలు రుజువైతే వెంటనే దోలా శంకర్ ను సస్పెండ్ చేసి ఆయన పై ఎస్ ఎస్ టి ఎట్రాసిటీ కేసు నమోదు చేసి చర్మకారుల ను అభివృద్ధి చేసే కొత్త ఎం డి ని నియమించాలని కోరుతూ సోమవారం కలక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో రవి ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భం గా రవిప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో లక్షలాది మంది చర్మకారుల కు డిక్చూసి గా ఉన్న లెదర్ ఇండస్ట్రీస్ డవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల తో చర్మకారుల అభివృద్ధికి లెదర్ పార్క్ లను ఏర్పాటు చేసి చర్మకారులలో నైపుణ్యతను పెంచేవిధంగా లెదర్ శిక్షణా కేంద్రాలను రాష్ట్ర రాజధాని ప్రాంత పరిధి విజయవాడ నది బొడ్డున ఉన్న ఆటో నగర్ లో ప్రారంభించకుండా దోలా శంకర్ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.లెదర్ పార్క్ ల నిర్లక్ష్యం వెనుక లిడ్ క్యాప్ ఎం డి ప్రమేయం ఉందని జిజ్జువరపు రవి ప్రకాష్ ఏలూరులో సోమవారం కలక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆరోపించారు.ధర్నా అనంతరం రవిప్రకాష్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్టు చెప్పారు.