కలెక్టరేట్ భవన మరమ్మత్తుల నిమిత్తం రూ.808 లక్షలు మంజూరు
1 min read– రాష్ట్ర ఆర్థిక మంత్రి/జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పల్లవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ భవన మరమ్మత్తుల నిమిత్తం రూ.808 లక్షలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి/జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయ పునరుద్ధరణ నిమిత్తం రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరమ్మత్తుల అంచనా మొత్తం రూ.808 లక్షల పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి/జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ శంకుస్థాపన గావించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి/జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో మాట్లాడుతూ కలెక్టరేట్ భవనం నందు వర్ష కాలంలో నీరు కారకుండా లీక్ ప్రూఫ్ పనులు, భవనంలో ఉన్న అన్ని టాయిలెట్స్ పునరుద్ధరణ, పాడైపోయిన కిటికీలను తొలగించి యూపివిసి కిటికీలు అమర్చుట, సన్ షేడ్స్, అవసరమైన చోట ఫ్లోరింగ్, సునయన ఆడిటోరియం నందు సీటింగ్, సౌండ్ ప్రూఫ్, సౌండ్ సిస్టం, ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ఏసి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సదరు మరమ్మత్తులను నాణ్యతతో నిర్మించి ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేలా భవనాన్ని సవరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి/జిల్లా ఇంఛార్జి మంత్రి జిల్లా కలెక్టర్ డా.జి.సృజనకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై.రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, ఈఈ సురేష్ బాబు, డిఈ రవిచంద్ర, 17వ వార్డు కార్పొరేట్ పద్మలత, ఆర్ అండ్ బీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.