NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ పార్టీ లో  ముస్లిం మైనార్టీ నాయకుడు అమీన్ భాయ్ చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : దివంగత భారత దేశ ప్రధాని ,భారత రత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా  రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు అమీన్ భాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు స్థానిక గాంధీనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఆయన ఆయనమద్దతు దారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ      ,భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో ముస్లిం మైనార్టీ వర్గాలకు అండగా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది అన్నారు, మోడీ రాక్షస పాలన వల్ల రోజూ రోజుకు ముస్లిం మైనార్టీ వర్గాలపై దాడులు అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నరని రానున్న రోజుల్లో బిజెపి నేతలను ఇంటికి పంపించడానికి దేశంలోని ముస్లింలు అందరూ సిద్ధంగాఉన్నారు, అని భారత్ జోడో యాత్ర తో రాహుల్ గాంధీ  అందరి మనస్సులో మరోమారు కాంగ్రెస్ పార్టీ పై ప్రేమను  కలిగించారు, భారత దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సుస్థిర పాలన అందించడం సాధ్యం అన్నారు.  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరి శెట్టి నరసింహారావు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, అన్సారీ భాయ్, నాగుర్ భాయ్, గౌస్ భాయ్,ముస్తాక్ భాయ్,రఫీ, అజిం, ఖాదర్ భాయ్, మెహ్బబ్ భాయ్, అలీములా,  అబ్రర్, రిహన, నసీమా, తదితరలు పాల్గొన్నారు.

About Author