కొత్త రోడ్డుపై సొంత నిధులతో బస్ షెల్టర్ నిర్మిస్తా.. ఆవుల బసిరెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కడప -కర్నూల్ జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు మీద బస్ షెల్టర్ లేక గర్భవతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ అధికారులల్లో, పాలకులలో, నాయకులలో ఈ విషయంపై ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమని బుడాయి పల్లెకు చెందిన ఆవుల బసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన సోమవారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చెన్నూరు కొత్త రోడ్డు, అరుంధతి నగర్ , కొత్త గాంధీ నగర్, బెస్త కాలనీ, లలోని పేద ప్రజలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోవడం జరిగిందన్నారు, అయితే అప్పటినుండి ఇప్పటివరకు, పాలకులు గాని, అధికారులు కానీ, నాయకులు గానీ ఎవరు కూడా వారి సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు, ఇప్పటికీ కొత్త రోడ్డు పైన, అలాగే కొత్త గాంధీనగర్, అరుంధతి నగర్ లలో డ్రైనేజీ సమస్యతోపాటు, సర్వీస్ రోడ్డు పనులు కూడా అరకొర చేసి వదిలి వేయడం జరిగిందని తెలిపారు, మిగిలిన పనులు పట్టించుకున్న నాథుడే లేడని అక్కడి ప్రజలు వాపోతున్నారని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా డ్రైనేజీ సమస్య ఉన్న కారణంగా వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలైన బెస్త కాలనీ, అరుంధతి నగర్, కొత్త గాంధీనగర్ కాలనీలు జలమయం అవుతాయని వారు ఆయన తెలియజేశారు, ఇది ఇలా ఉంటే చెన్నూరు కొత్త రోడ్డు వద్ద, బస్సు షెల్టర్ లేక అటు గర్భవతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వీరిని దృష్టిలో ఉంచుకొని తన సొంత నిధులతో త్వరలో కొత్త రోడ్డుపై బస్ షెల్టర్ నిర్మిస్తానని ఆయన తెలియజేశారు.