బాలల సంరక్షణపై అవగాహనా కార్యక్రమం..
1 min read– మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బాలలు దూరంగా ఉండాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్థానిక వగాయగూడెం కొత్తూరు జూట్ మిల్ కార్మికులకు నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం బాలల రక్షణ మరియు వారి వ్యసనాల నిర్మూలన నుండి దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేఖర్ బాబు మాట్లడుతూ ఆపదలో ఉన్న బాలలను పరిరక్షించుదo మరియు వారికీ రక్షణ గా ఉందాం బాలలంటే 18 సంత్సరాల లోపు వయస్సు కలిగినవారు అందరూ బాలలే అని తెలిపారు. వారి అభిప్రాయాలను గౌరవించాలని, వారి మాటలకు విలువని ఇవ్వాలని, బాలలను కొట్టడం, తిట్టడం మానసికంగా వేధించటం చేయరాదని అలా చేయడం ద్వారా వారు మానసికంగా కుంగుబాటుకు గురిఅవుతారని, వారి జీవితం పై తీవ్ర ప్రతికూల ప్రభావo చూపిస్తుందని సూచించారు. చట్టంలో ఉన్న మానవ హక్కులన్నీ పిల్లలకు కూడా వర్తిస్తాయని వారి హక్కుల రక్షణ అమలు పరచటం మన అందరి బాధ్యతని తెలిపారు. బాలల పట్ల లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఏదైనా మీకు తెలిసిన, లేదా చూసినా, బాలలకు నష్టం జరిగిన సందర్భాల్లో ఆలస్యం లేకుండా పోలీసులను వెంటనే సంప్రదించని వారి సహకారంతో బాలలను రక్షించాలని తెలిపారు. బాల్య వివాహాన్ని ప్రొత్స హించిన తల్లిదండ్రుల కు, సంరక్షకులకు కూడ చట్టపరమైన శిక్షలు పడతాయన్నరు. బాలలు మరియు యువత మందు, సిగరెట్, గంజాయి, మొదలైన మత్తుపదార్ధాలకి ఎక్కువగా అలవాటు పడటం అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరవ్వడం, చిన్న వయస్సు నుండే నేరప్రవృత్తి కి అలవాటు పడటం వలన, విలువైన జీవితాన్ని చిన్నా భిన్నo చేసుకోవడం సక్రమమైన మార్గం కాదన్నారు. ఇలా కొంతమంది మన మధ్యలోనే పాడు చేసుకోవడం మొదలైన వాటిని మనం చూస్తూనే ఉంటాం, విద్యార్థి దశ నుంచే సరి అయిన అవగాహన మనం ఇచ్చినట్లయితే వారు మత్తుపదార్ధాలకు బానిసలూ కాకుండా, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు. ఈ మత్తు పదార్ధాల వ్యసనం నుండి బైటకు తీసుకురావడానికి డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణస్థితికి తీసుకురావచ్చున్నరు. ఈ రకమైన చికిత్స అందించేందుకు ‘నవజీవన్ బాల భవన్ ఏర్పాటు చేసిన బోస్కో డీ-ఎడిక్షన్ సెంటర్ మెరుగైన ఫలితాలతో పనిచేస్తుందన్నారు. మా డి ఎడిక్షన్ సెంటర్లు పొలసనపల్లి గ్రామం, నుజివీడు, ఏలూరు జిల్లా లో ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్: 9490492020, ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో నవజీవన్ బాల భవన్ జోనల్ కోఆర్డినేటర్లు డి రజత, బి నేహేమియ, కె ప్రియాంక మరియు జ్యూట్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.