PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలి..

1 min read

– స్పందన అర్జీలు 287 స్వీకరణ..

– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించడమే కాకుండా పరిష్కార తీరు నాణ్యతతో ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల స్వీకరణ పరిష్కార కార్యక్రమం నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, డిఆర్డిఏ పిడి విజయరాజు,  ఆర్డిఓ కె. పెంచల కిషోర్ లతో కలిసి అర్జీలు స్వీకరించారు.  ఈ రోజు నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో 287 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారం ప్రజలు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు. అర్జీలను రీ ఓపెనింగ్ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి అర్జీలను పరిష్కరించి అర్జీదారులకు ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.  అర్జీలు  పరిశీలనలో భాగంగా నియమించిన జిల్లా  ఆడిట్ అధికారులు అర్జీల పరిశీలనలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలని అన్నారు. ప్రజలు నుండి అందిన అర్జీల పట్ల అత్యంత శ్రద్ధ వహించి పరిష్కరించాలన్నారు.

 ఈ రోజు వచ్చిన అర్జీలలలో కొన్ని….

          కొయ్యలగూడెం కు చెందిన పోలిన శివగంగకుమార్ తన భూమి 9.5 సెంట్లు 22ఎ లో చూపిస్తుందని ఆన్ లైన్ లో 22ఎ నుండి తొలగించి ఆ భూమిని రిజిష్ట్రేషన్ చేయించుకునేందుకు వీలు కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.  చల్లచింతలపూడికి చెందిన వడ్లపూడి రామ్మోహనరావు తనకు ద్వారకా తిరుమల మండలం మెట్టు పంగిడిగూడెం గ్రామంలో సర్వే నెం. 154/2 లో 3 ఎకరాలు 77సెంట్లు కు గాను 20 సెంట్లకు పడమరకు ఉన్న తన భూమిని ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంకు చెందిన మధ్యాహ్నపు సత్వవతి లక్ష్మీపురంలో తన భూమికి సంబంధించి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.  నిడమర్రు మండలం చిననిండ్రకొలను కు చెందిన కాళేపల్లి ఇందిరాదేవి తమ గాంధీ స్వయం సహాయ సంఘానికి సున్నావడ్డీ పధకం వర్తింప చేసేందుకు చర్యలు తీసుకోవాలనికోరుతూ అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author