పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణ..
1 min readనిల్వ నీటిని అరికట్టాలి ఫ్రైడే – డ్రైడే పాటించాలి..
సీజనల్ వ్యాధుల పట్ల నగర ప్రజలు జాగ్రత్తలు వహించాలి
సహాయ మలేరియ అధికారి జె గోవిందరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దోమ మన గృహాల్లో ఉండే కీటకాలలో చిన్న కీటకం అని దాని కాటు ఎవరికి కనిపించదనిమన రక్తాన్ని తాగి మనకే ప్రాణాంతక వ్యాధులైన డెంగు మలేరియా చికెన్ గున్యా పంటి జ్వరాలను సంక్రమంప చేసే ప్రమాదకరమైన కీటకం దోమ అని దోమల పట్ల విద్యార్థిని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక కొత్తపేట దాసరి వారి వీధిలో ఉన్న న్యూ జనరేషన్ స్కూల్ విద్యార్థులకు సోమవారం దోమల వలన వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు సూచించారు. నిన్ననే ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరిగిందని తెలిపారు. 1897 ఆగస్టు 20వ తేదీన బ్రిటీష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆడ అనాఫిలిస్ దోమ వల్ల మలేరియా అనబడి చలి జ్వరం మనుషులకు సంక్రమింప చేస్తుందని నిరూపించి మానవాళిని మలేరియా మరణాలు నుండి కొంతవరకు తప్పించగలిగారని వివరించారు. అలాగే మనకు హాని చేసే దోమలు మలేరియా కారక దోమ ఆడ్ అనాఫిలిస్, డెంగ్యూ కారక దోమ ఆడ ఎడిస్ మన గృహాలు గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ప్రతి కుటుంబం బాధ్యత తో పాటించాలన్నారు. నీళ్ల తొట్టెలు డ్రమ్ములు, ఓవర్ హెడ్ ట్యాంకులు ఎయిర్ కూలర్స్ , ఫ్రిజ్ వెనక బాక్స్ క్లీన్ చేసుకుని మూతలు పెట్టుకోవాలని, అదే విధంగా పూల కుండీల్లోనూ ఫ్లవర్ వాజ్ లో ఎక్కువ రోజులు నీరు నిలబ లేకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుభ్రతలో విద్యార్థులు కీలక భాగస్వామo పోషించాలని తెలిపారు. ఇక్కడ తెలుసుకున్న విషయాలు తమ తల్లిదండ్రులకు వివరించాలని, వారిని కూడా చైతన్యవంతులుగా మి నుండే అవగాహన కల్పించాలన్నారు. తద్వారా డెంగు మలేరియా వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడాలని సూచించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జ్వరాలు పైన పర్సనల్ పరిశుభ్రతపైన అవగాహన కల్పిస్తూ ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, ఏఎన్ఎం కోటం దుర్గాదేవి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్ ఆశా కార్యకర్త దేవి, స్కూల్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.