హోళగుంద విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతన్నలు
1 min readవర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండలంలో విద్యుత్ అధికారులు బోరు బావులకు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిస్తున్నారు ఇలా అయితే రైతన్నలకు ఆత్మహత్య శరణం అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు సింధువాళ్లం కృష్ణ ఉపాధ్యక్షుడు కాకి సీతప్ప మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు రెండు చేతులెత్తి విన్నవించుకుంటున్న సమస్య ఏంటంటే హోళగుంద మండలంలో వారంలో మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ కోతలు విపరీతంగా అంతరాయం కలుగుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు. కనీసం ఆ పెంచిన వాటికి అనుకూలంగా విద్యుత్ అందించవలసిందిగా విన్నపం ఎందుకనగా రాత్రి వేళలో చిన్న పిల్లలు వృద్దులు దోమల కాటుకు నానా ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. రైతన్నలు పండించిన పంట చేతికొచ్చే టైంలో ఇలా విద్యుత్ అంతరాయం కలిగితే రైతులు ఆత్మహత్య శరణం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం.