కరోన సమయంలో.. మరోసారి పెట్రోల్, డీజిల్ దెబ్బ..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్న సామాన్యులకు మరోసారి పెట్రో దెబ్బ పడింది. కరోన మొదటి దశ నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోన తర్వాత అంతకంతకు ఆదాయం పడిపోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పెరుగుదల మరింత భారంగా మారింది. ఆదివారం పెట్రోల్ మీద 28 పైసలు, డీజిల్ మీద 31 పైసలు పెంచారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో 100 పైగా చేరింది. దూరప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ముంబయి లాంటి వాణిజ్య కేంద్రాల్లో పెట్రోల్ ధర 101 , డీజిల్ ధర 93గా ఉంది.