26 వ తేదీ లోపు జీతాలు చెల్లింపు కు ప్రయత్నిస్తున్నాం
1 min read– ఆపస్ నాయకులకు తెలిపిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్.
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ మంగళగిరి నందు నిధి భవన్ నందు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ శ్రీ మోహన్ రావు గారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ కలిసి బదిలీ మరియు ప్రమోషన్ పొందిన టీచర్లకు దాదాపు మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, జీతాలు రాక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాశాఖ నుంచి క్యాడర్ స్ట్రెంత్ కూడా పూర్తిచేసి, డి డి ఓ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగిందని, పేర్లలైజేషన్ గురైన వారికి, పిజి టీచర్లకు, ఎంఈఓ 2 లకు పొజిషన్ ఐడీలు తమరికి పంపడం జరిగిందని,వెంటనే జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని,తగు చర్యలు తీసుకోవాలని వారికి వినతి పత్రం ఇచ్చి కోరగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ గారు సానుకూలంగా స్పందించి తమ సిబ్బంది అంతా అదే పనుల్లో నిమగ్నమై ఉన్నారని 26 వ తేదీ లోపు రెండు నెలల ఆరియర్ జీతాలు చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదనంతరం యధావిధిగా జీతాలు అందుతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జీల్లా అధ్యక్షులు రాజగోపాలాచార్యులు, కృష్ణా జిల్లా బాధ్యులు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.