కర్నూలు అభివృద్ధికి ప్రజల సహకారం కావాలి.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు అభివృద్ధి కావాలంటే ప్రజలు సహకరించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 12 వ వార్డులోని డబరాలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. వార్డులోని మహిళలు, వ్రుద్దులు, యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే కర్నూలు అన్నివిధాలా అభివ్రుద్ది చెందుతుందన్నారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజలందరికీ సంక్షేమం పథకాలు అందించడంతో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళతానని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలన్నారు. ప్రజలందరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరారు. వార్డుల్లో ప్రజలకు ఎదుర్కొంటున్న డ్రైనేజి సమస్యలను తాను ఎమ్మెల్యే అవ్వగానే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు చిన్నమ్మ, తారనాథ్, పండు, ఈశ్వర్, తిరుపాల్ బాబు, జగన్, తిమోతి, పెంచులయ్య, ఆనంద్, రియాజ్, శీను, వినోద్, తదితరులు పాల్గొన్నారు.