పొలాల్లో దొంగలు పడ్డారు..రైతులూ జాగ్రత్త..
1 min read-పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వరుణుడు కరుణించలేదు..దొంగలు అయితే ప్రస్తుతం పొలాల్లో దొంగలు పడుతున్నారు..ఇంకా రెన్నాళ్ళు వరుణుడు కరుణించకపోతే దొంగలు పట్టపగలే ఇండ్లల్లో దొంగలు పడతారేమో..ఇది ఏంటని అనుకుంటున్నారా..ఓ రైతు రాత్రి పొలంలో నీళ్లు కట్టి ఇంటికి వచ్చిన కాసేపటికే స్టాటర్,ఆమ్స్ మరియు ఆటోమేటిక్ లను దొంగలించారు దొంగలు పైపాలెం గ్రామంలో..పైపాలెం గ్రామానికి చెందిన మర్రి నారాయణ కుమారుడు మర్రి రవికి ఐదు ఎకరాల పొలం ఉంది.మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో త్రీఫేస్ కరెంట్ రావడం వల్ల పొలంలో వేసిన మొక్కజొన్న పంటకు నీళ్లు కట్టుటకు రవి వెళ్ళాడు.10 గంటలకు త్రీఫేస్ కరెంట్ పోయింది.దీంతో రవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఎల్లార్ ఇవ్వడం వల్ల కరెంట్ రాదని బుధవారం ఉదయం నాలుగు గంటలకు కరెంట్ వస్తుందని సబ్ స్టేషన్ వారు చెప్పడంతో రైతు రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చాడు. మళ్లీ తిరిగి బుధవారం ఉదయం 4 గంటలకు పొలంలో నీళ్లు కట్టడానికి వెళ్లి మోటర్ ఆన్ చేయడానికి వెళ్ళగా అక్కడ ఖాళీగా బాక్స్ కనపడడంతో రైతు కంగు తిన్నారు.తాళం పగలగొట్టి స్టాటర్,ఆమ్స్,ఆటోమేటిక్ లను దొంగలించి వాటిని తీసుకువెళ్లారని వీటి విలువ 25 వేల రూపాయలు ఉందని రైతు అన్నాడు.20 రోజుల క్రితమే కొత్తగా బోర్ వేశామని పైపాలెం-కడుమూరు రహదారిలో ఉన్న మర్రిచెట్టు ప్రాంతంలో పొలం ఉందని రైతు అన్నాడు.బుధవారం మిడుతూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానని రైతు రవి తెలిపారు.