మెట్ట పొలాలకు మరణ శాసనం… కానరాని చినుకు జాడ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: తొలకరి నుండి వర్షం కోసం ఎదురుచూసే అన్నదాతలకు ఈ ఏడు కడగండ్లు మిగిలాయి వర్షాకాలం మొదలైన రెండు నెలలైనా సరైన వర్షాలు లేక మెట్ట భూముల్లో పత్తి పంట వేసిన రైతులు గడివేముల మండలంలోనీ మంచాలకట్ట గని ప్రాంతంలో 400 ఎకరాల్లో వేసిన పత్తిని పాసేశారు ఈసారి సాగు విస్తీర్ణం తగ్గడం సరైన వర్షాలు లేకపోవడానికి కారణంగా వ్యవసాయ అధికారులు తెల్చారు ఇప్పటికీ ఎనిమిది వేల ఎకరాలు సాగులో ఉన్నట్టు దాదాపు ఖరీఫ్ సీజన్లో ఏట 18వేల ఎకరాల పైచిలుకు సాగు చేశారని ఈ యేడు వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గిందని ఎక్కడ చూసినా వ్యవసాయ భూములు పచ్చగా కనిపించడం లేదు. వానల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు.. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగు చేశారు. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో కుంగిపోతున్నారు వాతావరణంలో వేడి ఎండాకాలం తలపిస్తుందని వేడి గాలుల వల్ల మొక్కలు వాడిపోతున్నట్టు రైతులు తెలిపారు అక్కడక్కడ జులై మొదటి వారంలో మెట్ట ప్రాంతంలో వేసిన సోయాబీన్ కొద్దిగా బాగానే ఉన్నా జూలై ఆఖరి వారంలో వేసిన పంటలు వాడిపోయినట్టు రైతులు వాపోయారు గత వారం పది రోజుల క్రితం కేసి నీరు విడుదల చేసిన పెసర వాయి వరకు నీరు అందుతున్న అక్కడి నుండి దాదాపు గడిగరేవుల ప్రాంతం వరకు నీరు అందడం లేదని ఆయికట్టు రైతులు వాపోయారు ఈసారి వ్యవసాయం తమకు నష్టాలు మిగిల్చేలా ఉందని రైతులు వాపోయారు మండలంలో వింత వాతావరణ రైతులకు శాపంగా మారింది గడివేముల నుండి బూజునూరు పెసర వాయి కరిమద్దెల చిందుకూరు గడిగిరేవుల వరకు ఆయకట్టు కింద రైతులు సాగు చేస్తున్న వారి పరిస్థితి బోర్ల లో నీరు ఉండడంతో కేసీ నీరు కొద్దిగా పంటలకు ఊపిరి పోస్తుంది వారం పది రోజులు ఇలాగే ఉండి వానలు పడకపోతే తమ పరిస్థితి కూడా అగమ్య గోచరమని గడివేముల నుండి మంచాలకట్ట గని ఉండుట్ల పై భోగుల పరిస్థితి పూర్తిస్థాయిలో ఘోరంగా తయారైంది మేట్ట పంట ఆధారమైన భూములు బోర్లు తక్కువ ఉండడం ఈ ప్రాంతాలలో దాదాపు ఇప్పటికి 60% పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా పత్తి పంట వేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది చూడాలి మరి ఇప్పటికైనా వాన దేవుడు కరుణించి మూడు రోజులు భారీ వర్షాలు పడితే పంటలకు ఊపిరి నిలబడుతుంది.. వాన దేవుడా కరుణించు రైతులకు నష్టాలు ఊబిలో నుంచి బయటపడేలా కాపాడు.