PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ఎక్కడ..

1 min read

– ఎస్ఎఫ్ఐ.విద్యార్థి సంగ్రామ బైక్ యాత్ర

పల్లెవెలుగు వెబ్ గడివేముల పాణ్యం:  అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఒక ఉపాధ్యాయ అధ్యాపక పోస్టు కూడా భర్తీ చేయలేనంత దుర్భర స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గురువారం నాడు జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యారంగ అభివృద్ధికై 2వ రోజు విద్యార్ధి సంగ్రామ బైక్ యాత్ర పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్ ఆరోపించారు ఈ సందర్భంగా పాణ్యం పట్టణంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా కార్యదర్శి నిరంజన్,అధ్యక్షులు కుమార్,జిల్లా కోశాధికారి ఓబులేసు, జిల్లా సహాయ కార్యదర్శి మధు కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా అందించలేనంత దుర్భర పరిస్థితిలో  ప్రభుత్వం  ఉందని  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని విద్యారంగా అభివృద్ధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకుంటుంది తప్ప క్షేత్రస్థాయిలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని కనీసం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఒక్క అధ్యాపక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో నాడు నేడు కింద చేర్చి వసతులు ఏర్పాటు చేస్తామని చెబుతుంది తప్ప ఆచరణలో చేయడం లేదని తెలియజేశారు సంక్షేమ హాస్టల్లో వర్షం పడితే గదులన్నీ కారుతున్నాయని విద్యార్థుల పాఠ్యపుస్తకాలు దుస్తులు దుప్పట్లు తడిసి ముద్దవుతున్నాయని శిథిలావస్థ స్థితిలో ఉన్న సంక్షేమ హాస్టలను మరమ్మతులు కూడా చేయడం లేదని, అనేక ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు కూడా విద్యార్థులకు లేవని పాఠశాల సమయంలో విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం ఉపాధ్యాయులకు కూడా మరుగుదొడ్లు లేని స్థితిలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్టిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రశాంత్, పాణ్యం మండల ఎస్ఎఫ్ఐ నాయకులు సతీష్,సుభాష్, చరణ్,మధు, తదితరులు పాల్గొన్నారు.

About Author