ప్రభుత్వ ఆసుపత్రుల లో కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి..
1 min read– మాతృ , శిశు మరణాలు సంభవించ కూడదు
– వంద శాతం విద్యార్థులు పాఠశాల , కళాశాల లో తిరిగి చేర్పించాలి
– ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి లబ్ధిదారులను గుర్తించండి
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ,మాతృ , శిశు మరణాలు సంభవించ కూడదు మరియు బయట ఉన్న విద్యార్థులను వంద శాతం పాఠశాల , కళాశాలకు మళ్లీ వచ్చి చేరాలని ఆ విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ జిల్లాలో బడి బయట ఉన్న విద్యార్థులను వెంటనే తిరిగి పాఠశాలలో మరియు కళాశాలలో చెర్పించే చర్యలు చేపట్టము కొరకు జిల్లాలో చాలా చర్యలు చేపట్టటము జరిగింది అని ఓపెన్ స్కూలు కు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం సమాచారం ముందస్తుగా గ్రామాలలో తెలియపరచాలని ఆ ప్రోగ్రాంలో బాల్యవివాహాలు, చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం మంచిది కాదని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని తెలిపారు. ముప్పై సంత్సరాల పైన ఉన్న అందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి బి.పి. , షుగర్ వ్యాధులు నియంత్రణ లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.హై రిస్క్ గర్భిణీ స్త్రీలను ముందస్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రసవాలు జరిగే లాగా చర్యలు తీసుకోవాలని, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు వినియోగించు కొవాలని , ఆసుపత్రిలో సిబ్బంది , అవసరమైన ఏర్పాట్లు ఉండాలని , రక్తహీనతతో ఎవరూ ఉండ కూడదు అని అవసరమైన వారికి రక్తం ఎక్కించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మాయిలు , చిన్న వయస్సు పిల్లలకి రక్త హీనత ఉండరాదని వారికి కావలసిన ఆహార పదార్థాలు మరియు సంబంధిత మందులు కూడా ఇచ్చి కావలసిన సమాచారాన్ని, సేవలు అందించాలని కోరారు.గౌరవ ముఖ్యమంత్రి ఈనెల 30వ తారీఖున అన్ని జిల్లాల జగనన్న కాలనీలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల గృహాలకు కరెంటు , పెయింటింగ్ , ఇంకుడు గుంతలు , రోడ్లు మొదలగు ఏర్పాట్ల లతో 100% పూర్తయి ఉండాలని ఈ గృహాలను మొదట పంచాయతీ , వార్డు, సెక్రటరీలు తనిఖీ చేయాలని , తర్వాత 20 శాతం గృహాలు ఎంపీడీవోల ద్వారా మరియు 10% మున్సిపల్ కమిషనర్లు లేదా జోనల్ అధికారుల ద్వారా తనిఖీ చేయబడాలని , ప్రతి లేఅవుట్ కు స్వాగత ద్వారము( వెల్కమ్ ఆర్చ్) ఏర్పాటు చేసుకోవాలని , ప్రభుత్వ నిర్దేశిత మార్గ సూత్రాలకు అనుగుణంగా స్వాగత ద్వారాలు నిర్మించాలని ఆదేశించినారు.నాడు – నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని, వాలంటీర్లు ఖాళీలు పూరించటానికి మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ సి ఈ ఓ లు చర్యలు తీసుకోవాలని, సిటిజెన్ సెంటర్ లు పని చేయించాలని, వైయస్సార్ బీమా పొందడానికి లబ్ధిదారులకు కావలసిన సర్టిఫికెట్లు వెంటనే ఏర్పాటు చేసి వారికి బీమా వర్తించే విధంగా చేయాలని కోరారు.ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సెప్టెంబర్ 17న ప్రారంభిస్తున్నారు. అందుకుగాను 18 రకాల కళాకారులు అనగా బంగారు పని చేసేవారు , కుమ్మరి పని , బోట్లు తయారు చేసేవారు , టైలర్లు మొదలగు కళాకారులను ఈ పథకం కింద తీసుకురావాలని ,18 సంవత్సరాలు నిండిన వారు ఈ విశ్వకర్మ యోజన లబ్ధి పొందవచ్చు అని ఇందులో వీరికి లోన్ సదుపాయము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుందని కావున లబ్ధిదారులను వెంటనే గుర్తించి జిల్లా కమిటీ ద్వారా (జిల్లా కలెక్టర్ చైర్మన్ , జీఎం ఇండస్ట్రీస్ కన్వీనర్ గా) లబ్ధిదారులను గుర్తించాలని చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లను ఆదేశించినారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ,సి.పి.ఓ ,డి.ఎం& హెచ్.ఓ, ఎస్.ఈ పిఆర్ ,హౌసింగ్ పీ.డీ ,డి.పి.ఓ, పీడి డి.ఆర్.డి ఎ, జెడ్.పి. సి.ఈ.ఓ ,యస్.ఈ ట్రాన్స్ కో , పి.ఓ యస్.యస్.ఏ , డి.ఈ.ఓ,ఐ.సి.డి.యస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.