టిడిపి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. టిజి భరత్
1 min readనీలి షికారిల సమస్యలు పరిష్కరిస్తాం… టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ఉన్న నీలి షికారిల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని 13 వ వార్డు బంగారుపేటలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి పర్యటించారు. ప్రజలకు తెదెపా మొదటి విడత మేనిఫెస్టోను వివరించారు. కెసి కెనాల్ దగ్గర రోడ్డు విస్తరణ పేరుతో ప్రత్యామ్నాయం చూపించకుండా ఇల్లు కూల్చివేయడం మంచిది కాదన్నారు. తమ తండ్రి టిజి వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని.. ఇప్పుడు పాలకులు ఏదైనా అనుకుంటే వెనకా ముందు ఆలోచించకుండా చేస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు తాను గెలిచిన వెంటనే తీరుస్తానని, నీలి షికారిలను ఎస్టీల్లో చేర్చే విషయంపై టిడిపి ప్రభుత్వం వచ్చాక చేస్తామన్నారు. ఇక మహిళలు, యువతతో పాటు అందరికీ మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు. టిడిపి ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివ్రుద్దిలో ముందుకు వెళుతుందన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కర్నూల్లో వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఏ వార్డుకు వెళ్లినా పారిశుధ్య సమస్య వేధిస్తుందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సమస్యలు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, సురేష్, విఠల్ శెట్టి, పురుషోత్తం, మధు, శేఖర్, శివ, భాస్కర్, ఎల్లయ్య, సంజయ్, రేష్మ, రవి తదితరులు పాల్గొన్నారు.