ఎస్ఐ నియామక దేహ ధారుడ్య పరీక్షలు ప్రారంభం….
1 min read– పరుగు పరీక్షలను జెండా ఊపి ప్రారంభించిన….
– కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్
– జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు (ఆగష్టు 25 తేది) శుక్రవారం నుండి కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో దేహదారుడ్య ( PMT, PET ) పరీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సంధర్బంగా కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారులు దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి గారు మీడియా తో మాట్లాడుతూ…ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసిన అభ్యర్ధులకు ఈ రోజు నుండి ఫిజికల్ మెజర్ మెంట్, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ లు ప్రారంభమయ్యాయి . రాయలసీమ రేంజ్ పరిదిలో 16 వేల 108 మంది అభ్యర్దులు పాల్గొంటున్నారు. ( 14,011 మంది పురుషులు, 2, 097 మంది మహిళ అభ్యర్దులు) ప్రతి రోజు 8 వందల మంది అభ్యర్దులు దేహ దారుడ్య పరీక్షలలో పాల్గొంటారని , పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందన్నారు.రోజూ ఉదయం 5 గంటల నుండి దేహదారుడ్యల పరీక్షల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.అన్ని ఏర్పాట్లను సిధ్దంగా ఉంచాము. ప్రతి రోజు అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలన చేస్తారు. ఎత్తు, చాతీ వంటి ఫిజికల్ మెజర్ మెంట్స్ చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తారు.మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు విరామ సమయం ఉంటుంది. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎక్కడ కూడా ఏలాంటి ఆరోపణలు, పొరపాట్లకు తావు లేకుండా ఆధునిక ఆర్ ఎఫ్ ఐ డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజితో పకడ్బందీ ఏర్పాట్లు చేసాము. డిజిటల్ గా, పారదర్శకంగా ఈ వెంట్స్ నిర్వహిస్తున్నాము. ఎస్సై అభ్యర్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామంటూ దళారుల మాటలు నమ్మవద్దని , ప్రలోభాలకు గురికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆగష్టు 25 వ తేది నుండి సెప్టెంబర్ 20 వ తేది వరకు ఈ వెంట్స్ జరుగుతాయి. సమస్యల పై అప్పీల్ చేసుకునే వారు రిక్విజేసేన్ రాసి ఇచ్చి , సర్టిఫికెట్ వెరిఫికెషన్ లో ఏదైనా లోపాలు ఉంటే సెప్టంబర్ 21 వ తేదిన అప్పీలుకు రావలని తెలిపారు. రాయలసీమ రేంజ్ పరిధిలో కర్నూలు జిల్లా ఎస్పీ గారితో పాటు ఇతర జిల్లాల ఎస్పీల సహాకారంతో 300 మంది పోలీసు సిబ్బంది రోజు ఉదయం 4 గంటల నుండి దేహదారుడ్యల ప్రక్రియ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. పకడ్బందీగా పని చేయాలని బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది.పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్ధులకు అత్యవసర పరిస్ధితులలో ఏదైనా జరిగితే అంబులెన్స్, డాక్టర్స్ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాము. దేహాదారుడ్యు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధువపత్రాలతో హాజరు కావాలని, లేటెస్ట్ కుల దృవీకరణ సర్టిఫికెట్ , క్రిమిలేయర్ సర్టిఫికెట్ తీసుకురావాలి.వాటితో పాటు ఆధార్, అడ్మిట్ కార్డు, స్టడీ, మార్కిలిస్టులు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు ( గెజిటెడ్ సంతకం) తప్పనిసరిగా తీసుకుని రావలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగబాబు, డిస్పీలు, డిపిఓ ఏవో సురేష్ బాబు, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు ఉన్నారు.