ఫ్రైడే – డ్రైడే పాటించండి..
1 min read– ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి..
– డియం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఆశ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. ఆశ అన్నారు. స్థానిక శనివారపుపేట లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ‘ ఫ్రైడే – డ్రై డే ‘ కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఆశ మాట్లాడుతూ నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇంటి చుట్టూ పరిసరాలను అపరిశుభ్రంగా ఉంటె దోమలు వ్యాప్తి చెందుతాయని, వీటి కారణంగా వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతాయన్నారు. ప్రతీ ఇంటిలోనూ ప్రతీ శుక్రవారం నీరు నిల్వ ఉంటె ప్రాంతాలను శుభ్రం చేసుకుంటే దోమల వ్యాప్తి అరికట్టవచ్చన్నారు. చెత్తను రోడ్లపై పదివేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేసి ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే వారికి అందించాలన్నారు. అనారోగ్య పరిస్థితులు దరిచేరకుండా ఉండాలంటే పారిశుధ్యం పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో దోమల నిర్మూలన మందులను చల్లారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.