ఎమ్మెల్యే ఆర్థర్ ఆదేశాలతో స్మశాన వాటికలో బోరుబావి ఏర్పాటు
1 min read– ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ కు కృతజ్ఞతలు తెలిపిన 6వ వార్డు కౌన్సిలర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని కొణిదేల రోడ్డు ప్రక్కన ఉన్న తోగట వీర క్షత్రియ స్మశాన వాటికలో నీటి వసతి లేదని, బోరు నిర్మాణం చేపట్టాలని పట్టణ 6వ వార్డు కౌన్సిలర్ దేశెట్టి సుమలత, శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కు విన్నవించుకున్నారు. వారి విన్నపం విన్న ఎమ్మెల్యే ఆర్థర్ వెంటనే స్పందించి బోరు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసి నిర్మాణం చేపట్టి నీటి వసతిని కల్పించారు.ఈ సందర్బంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కమిటీ అభ్యర్థన మేరకు బోరు వేయించి నీటి వసతిని కల్పించిన ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ కు 6 వ వార్డు కౌన్సిలర్ దేశెట్టి సుమలత మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ, అడిగిన వెంటనే స్పందించి క్షత్రియ స్మశాన వాటికకు బోరు వేయించి నీటి వసతిని కల్పించిన ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ కి నంద్యాల జిల్లా తొగటవీర క్షత్రియ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు కొప్పుల సత్యనారాయణ చౌడేశ్వరి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోరుముట్ల రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు దేశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పాణ్యం వేణుగోపాల్, కోశాధికారి పూజారి బాబు, సభ్యులు జల్లు రామచంద్రుడు, ఎం కృష్ణ, కొప్పుల వెంకటేష్, చింత ధనుంజయ, గుంపు శ్రీకాంత్, కుల బాంధవులు జల్లు శేషయ్య, డాలు శివకృష్ణ, దేశెట్టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.