జిల్లా అతిధి గృహాన్ని ప్రారంభించిన జిల్లాకలెక్టర్
1 min read– రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులకు సన్మానం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమీపంలో గిరిజన భవన్ ప్రక్కన నూతనంగా నిర్మించిన జిల్లా అతిధి గృహాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ దంపతులు వె. ప్రసన్న వెంకటేష్, మానసలు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ నూతన భవన నిర్మాణానికి నిధులు సమకూర్చి నిర్మింపజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆళ్ల సతీష్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బి. రామ్మోహన్ రావు, సెక్రటరీ కాకి సూరిబాబు, ట్రెజరర్ శ్రీనివాసరావు, డి. జయప్రకాష్, ఈ భవనాన్ని నిర్మించిన ఎస్ ఎల్ వి కన్ స్ట్రక్షన్ పి. శ్రీనివాసరాజు లను జిల్లా కలెక్టర్ శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం జిల్లా అతిధిగృహ నిర్మాణానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ను జిల్లా అధికారుల పక్షాన జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి , ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్ తదితర అధికారులు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణిని కూడా శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించుకున్న జిల్లా అతిధి గృహాన్ని ప్రస్తుతం ఎంత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉందో అదే విధంగా రోజువారీ నిర్వహణ ఉండాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం జిల్లా అతిధిగృహం ప్రాంగణంలో జిల్లాకలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ సతీమణి డా.మానస,జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి డా. మానస, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, డిఆర్వో ఎవిఎన్ఎస్ మూర్తి, ఏలూరు ఆర్డిఏ కె. పెంచల కిషోర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆళ్ల సతీష్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బి. రామ్మోహన్ రావు, సెక్రటరీ కాకి సూరిబాబు, ట్రెజరర్ శ్రీనివాసరావు, డి. జయప్రకాష్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.