500 ఎకరాలకు సాగునీరిస్తాం..
1 min read– ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
– రూ.కోటి 65 లక్షలతో నగిరిపాడు చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి: మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ కొరముట్ల శ్రీనివాసులు ఉద్ఘాటించారు. ఆదివారం చిట్వేలు మండలం నగిరిపాడు చెరువు కోటి 65 లక్షలతో పునరుద్ధరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. చెరువు పునరుద్ధరణ పనుల వల్ల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చన్నారు. రైతు సంక్షేమంగా ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నియోజకవర్గంలోని 12 చెరువుల పునరుద్ధరణ పనులు దాదాపు రూ. 13.50 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేయించడంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసుల పాత్రకీలకమని రైతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు చంగల్ రాయుడు, పార్టీ నాయకులురాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మలిశెట్టి వెంకటరమణ, మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏ వన్ కాంట్రాక్టర్ పాటురి శ్రీనివాస్ రెడ్డి , lvమోహన్ రెడ్డి , వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి,రమణ, లక్ష్మికర్, సుధాకర్ రాజు, స్థానిక నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.