సిలంబం పోటీలను ప్రారంభిస్తున్న డాక్టర్ శంకర్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ డిఎస్సీ అవుట్డోర్ స్టేడియం నందు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు సిలంబం క్రీడకు 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలింబం ప్రాచీన నాటి విద్య కళ ఈ క్రీడకు ప్రాచీన నాటి కాలం నుండి ఎంతో ఎంతోమంది పూర్వీకులు ఈ విద్యను అనుసరించి ఆత్మరక్షణకు మరియు దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ విద్య నేర్చుకోవడం వల్ల చదువుతోపాటు పిల్లల ఆరోగ్యంగా ఉండాలని వివరించారు ఈ కార్యక్రమంలో శిలంబం శిక్షకుడు పి రాఘవేంద్ర మహావీర్ గోపి సాయినాథ్ సతీష్ కుమార్ ఝాన్సీ బహదూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.