ఈ నెల 28న ఆర్డీవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏపీ మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకై ఈనెల 28న ఏ ఐ ఎస్ ఎఫ్ తలపెట్టిన ఆర్డిఓ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సమీర్,శివ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చదువు రామయ్య భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు సమీర్ శివ మాట్లాడుతూ, దాదాపుగా విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలు కావస్తున్నా ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయలేకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ఈ నిర్లక్ష్యానికి ముఖ్యంగా పత్తికొండ విద్యాశాఖ మొద్దు నిద్ర ఆవహించిందని, జూన్ నెల నుంచి ఈ విషయమై ఎంఈఓ, ఎమ్మార్వో, ఆర్డీవో గారికి వినతి పత్రాలు అందించినప్పటికీ ఆ వినతి పత్రాలు చెత్త బుట్టలోకి పోతున్నాయి తప్ప విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేద్దామన్న ఆలోచన అధికారులకు పట్టడం లేదు అని వాపోయారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం బహిరంగ సభలలో రాష్ట్రంలో విద్యా రంగానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారుు. కానీ మేము ఈరోజు అడుగుతున్న ఆదర్శ పాఠశాలలో బాటని, జువాలజీ, మ్యాథ్స్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలని, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అనిి అన్నారుు.దీన్ని మేము ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం అని వారు తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్లో నెలకొనిిి ఉన్న సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఒత్తిిిడి చేసేందుకు సోమవారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డిిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తల పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేయాలని కోరారు. కార్యక్రమంలోో ఆదర్శ కళాశాల పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ అధికారులు స్పందించకుంటే చలో కలెక్టరేట్ కు సైతం పులిపినిస్తామని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, రమేష్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.