NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిమ్నాసియం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

1 min read

– పని ఒత్తిడి నుండి ఉపశమనం వ్యాయామం..

– ప్రతి ఒక్క ఉద్యోగి నడక వ్యాయామంపై శ్రద్ధ వహించాలి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆఫీసర్స్ క్లబ్ లో నూతనంగా నిర్మించిన జిమ్నాసియంను శనివారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి డా.మానస,జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, డిఆర్వో ఎవిఎన్ఎస్ మూర్తి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ యం.వి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  ఈ జిమ్నాసియంలో డంబెల్స్ మొదలు ట్రెడ్ మిల్స్ వరకు వివిధ వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.   ఈ సందర్బంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతిఒక్కరూ నడక, వ్యాయామంపై కొంత సమయం కేటాయించుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.  ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు.  కార్యాలయంలో పనిఒత్తిడి నుంచి ఉపసమనం పొందేందుకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు.  వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా తమనుతాము కాపాడుకోగలుగుతామన్నారు. జిమ్నాసియంను అధికారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఎంతో అనుభవం కలిగిన శిక్షకుడు ఆధ్వర్యంలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిమ్నాసియం శిక్షకులకు, నిర్వహణకు అవసరమైన ఖర్చుకోసం ప్రతినెలా కనీస మొత్తాన్ని జిమ్నాసియంకు వచ్చేవారినుండి వసూలు చేయవలసి వుంటుందన్నారు.  ఈ జిమ్నాసియంను నాణ్యతతో నిర్మించిన ఎస్ఎల్ వి కన్ స్ట్రక్షన్ పి. శ్రీనివాసరాజును కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభినందించారు.

About Author