PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేస్తా చూస్తా కాదు..చేసి చూపించారు తహసిల్దార్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: కొందరు అధికారులు ప్రజలకు పనులు చేయాలంటే చేస్తా చూస్తానంటూ కాలయాపన చేసే అధికారులు ఉన్నారు. అంతేకాకుండా తన కార్యాలయంలో పని చేసే అధికారులకు లంచం ఇవ్వవద్దు-అధికారులతో ఉచితంగా ప్రజలు పనులను చేయించుకోవాలనే ఫ్లెక్సీని తన కార్యాలయానికి ఏర్పాటు చేయడానికి ఎక్కువ శాతం అధికారులు ముందుకు రారు. కానీ మిడుతూరు మండల తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు14.06.2023 న మిడుతూరు తహసిల్దార్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం అప్పట్లో బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ ప్రకాష్ బాబు దృష్టికి వచ్చిన వెంటనే త్వరలోనే కార్యాలయానికి అధికారులకు డబ్బులు ఇవ్వకూడదంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తానని చెప్పారు చెప్పిన మాటకు గురువారం ఉదయం తహసిల్దార్ కార్యాలయానికి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే “తహసిల్దార్ వారి కార్యాలయం నందు పనుల కొరకు మధ్యవర్తులను దళారీలను సంప్రదించవద్దు అని ఎవరైనా పనుల పూర్తి కోసం మిమ్ములను డబ్బులు అడిగిన ఎడల వెంటనే మిడుతూరు తహసిల్దారును సంప్రదించి ఫిర్యాదు చేయాలని వీటి పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిడుతూరు తహసిల్దార్ ప్రజలను కోరారు” అని వ్రాయించిన ఫ్లెక్సీని కార్యాలయానికి పెట్టారు. ఇంతవరకు ఎంతోమంది తహసీల్దార్లు మారారు కానీ ఇలాంటి ఆలోచన ఎవరికి తట్టలేదేమో.. నూతన తహసిల్దార్ చేపట్టిన విధానానికి మండల ప్రజలు తహసిల్దార్ ప్రకాష్ బాబుకు హ్యాట్సాఫ్ చెల్లిస్తున్నారు.తహసిల్దార్ చేపట్టిన విధానానికి గ్రామస్థాయి నుంచి కార్యాల సిబ్బంది వరకు రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఎలాంటిది ఆశించకుండా పనిచేస్తారా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే..?

About Author