PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితుల ఆక్రమిత భూమిని అప్పగించిన అధికారులు   

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో దళితుల భూమిని దౌర్జన్యంగా కొందరు ఆక్రమించుకోగా, బాధితులు తమ గోడును స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులకు వినిపించగా, అందుకు అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన దళితుల భూమిని తిరిగి దళిత బాధితులకు అప్పగించారు. ఈ మేరకు బాధితుడు మీసాల శ్రీనివాసులు పట్టా భూమిని ఎస్సై మల్లికార్జున, జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు మండల సర్వేయర్ గాది లింగప్ప భూమి చుట్టుకొలతలు వేయించి బాధితుడికిభూమినిఅప్పగించినట్లు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్రమణకు గురైన దళితుల భూమిని తిరిగి దళితులకు అప్పగించడంలో ఎంఆర్పిఎస్ సుజాత పోరాటం చేసిందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ సాధించిన పోరాట ఫలితంగానే దళితుల భూమిని తిరిగి దళితులకు దక్కిందని అన్నారు. తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 287/1a విస్తీర్ణం ఐదు ఎకరముల భూమి మాదిగ మునెప్పకు 1979 సంవత్సరమున భూ పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం డి పట్టా మంజూరు చేసి ఆర్ ఎస్ ఆర్ ఓల్డ్ ఆర్ ఓ ఆర్ పట్టాదారు పాస్ బుక్కులు అడంగల్ వన్ బి రెవెన్యూ రికార్డుల నందు సక్రమంగా పొందుపరచడమైనది ఈ భూమిలోని 1, ఎకరా 47 సెంట్లు భూమిని  ఉలసాల ఆదినారాయణ ఆక్రమించుకొని మాదిగ మునెప్ప కుమారుడు మీసాల శ్రీనివాసులపై బొందిమడుగుల గ్రామానికి చెందిన  సద్దిగంటు మునిరెడ్డి సహకారంతో ఆయనకు పత్తికొండ ఎమ్మెల్యే సహకారం ఉండడంతో బాధితుడు మీసాల శ్రీనివాసులు భూమిని  ఆదినారాయణ కు సపోర్ట్ చేస్తూ, భూమిని ఆక్రమించుకోవడం కొరకు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొని వచ్చి పట్టాదారుడైన మాదిగ శ్రీనివాసులు భూమిని ఆక్రమించుకోవాలని ఉద్దేశపూర్వకంగా  సద్దిగంటు మునిరెడ్డి సహకారంతో ఉలసాల ఆదినారాయణ రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి తుగ్గలి ఎస్సై మల్లికార్జున ద్వారా  అసైన్మెంట్ పట్టా భూమికి 145 పెట్టి బాధితులను ఇబ్బంది పెట్టడం మైనది  తద్వారా పట్టాదారుడైన మాదిగ శ్రీనివాసులు మా భూమికి చుట్టుకొలతలు వేసి హద్దులు చూపించండి అని తుగ్గలి తాసిల్దార్ గారికి చలానా కట్టి అర్జీ ఇవ్వగా మండల సర్వేయర్ గాది లింగప్ప గారిని పంపి చుట్టుకొలతలు వేయించారు అయితే సది గంటు మునిరెడ్డి   ప్రోత్సాహంతో కొలతలు వేసిన హద్దురాలను అక్రమార్కులు తొలగించారు వారిపై తుగ్గలి పోలీస్ స్టేషన్లో 57/2023 62/2023 సద్దిగంటు ముని రెడ్డి తో పాటు ఆదినారాయణ పై పోలీసులు కేసు నమోదు చేయడమైనది ఈ కేసుల నుండి బయట పడడం కోసం ఆదినారాయణ కుటుంబ సభ్యులు సంజమ్మ సుంకు లక్ష్మి వారికి వారే తలలు పగలగొట్టుకొని అక్రమంగా పటాదారుడు మాదిగ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పై అక్రమ కేసు 60/2023 కేసు నమోదు చేయించి ఎస్సై మల్లికార్జున ద్వారా తుగ్గలి తాసిల్దార్కి 145 పెట్టమని లెటర్ పెట్టారు అయితే తాసిల్దారు  ప్రభుత్వం కల్పించిన భూమికి 145 పెట్టడం వీలుపడదు 287/1a విస్తీర్ణం ఐదు ఎకరంల భూమి  బాధితుడికి మీసాల శ్రీనివాసులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అని  తెలపడమైనది పట్టాదారుడు మా భూమిని మరల కొలవండి హద్దురాలను తొలగించారు అని మరలా మీసాల శ్రీనివాసులు తాసిల్దార్కి అర్జీ ఇవ్వడం మైనది స్పందించిన తాసిల్దార్  తుగ్గలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి బందోబస్తు కల్పించండి 287/1a భూమి మీసాల శ్రీనివాసులకు హద్దులు చూపించాలని లెటర్ పెట్టాడు మెనూ లేదని 23. 8 2023 బందోబస్తు కల్పించలేదు. అయితే బాధితులైన మీసాల శ్రీనివాసులు  ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో పత్తికొండ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసి మా భూమిని హద్దులు ఏర్పాటు చేయుటకు బందోబస్తు కల్పించాలని ఫిర్యాదు చేయగా స్పందించిన డిఎస్పి, జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు తుగ్గలి ఎస్సై మల్లికార్జున ఏఎస్ఐ నరసప్ప పదిమంది కానిస్టేబుల్ ఆధ్వర్యంలో మండల సర్వేర్ గాది లింగప్ప శనివారం దళితుల  భూమికి   చుట్టుకొలతలు వేసి హద్దులు ఏర్పాటు చేసి, భూమి అక్రమనకు పాల్పడిన  ఆదినారాయణ కు ఈ భూమి మీకు సంబంధం లేదు అని తెలుపుతూ, హద్దులు ఏర్పాటు చేశారని తెలిపారు. పట్టాదారుడైన హక్కుదారుడైన బాధితులకి బందోబస్తు కల్పించి మండల సర్వేయర్ గాది లింగప్ప ద్వారా భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి హద్దురాలను నాటి బాధితుడికి న్యాయం చేసిన పోలీస్ ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సర్వే కార్యక్రమంలోసచివాలయం సర్వేర్ కృష్ణ , కానిస్టేబుల్ వీఆర్ఏ మస్తాన్ ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ ఏసోబు రాజశేఖర్ శ్రీనివాసులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author