పిచ్చికుక్క కాటుకు పలువురికి గాయాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : జీతాలు వస్తే చాలు అధికారుల తీరుతో గ్రామస్తుల ఇబ్బందులు మండల కేంద్రంలో శనివారం నాడు బీసీ కాలనీ పరిసరాల్లో ఏడు మందికి పిచ్చి కుక్క కరిచి గాయాలయ్యాయి మండలంలో కుక్కల కోతుల బెడద ఉన్న అధికారులకు ఇవేమీ పట్టడం లేదు సమస్యలు చెప్పడానికి వెళ్తే ఆమడ దూరం పారిపోతున్నారు ఇష్టం లేకున్నా జీతాల కోసం కార్యాలయాలకు వస్తున్నట్టు సాక్షాత్తు మండల స్థాయి అధికారులు విధులకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు గడివేముల గ్రామానికి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తమ సొంత సమస్యలపై తక్షణమే స్పందించినంతగా ప్రజా సమస్యలపై స్పందించడం ఎప్పుడో మానేశారు కనీసం వారానికోసారి బ్లీచింగ్ పౌడర్ చల్లడం కూడా చేయడం లేదు సీజనల్ వ్యాధులతో గడివేముల గ్రామస్తులు బాధపడుతున్న ఫాగింగ్ పారిశుద్ధ్యం ఇవేవీ వారికి పట్టవని కనీసం జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కుక్కల సంతతిని నియంత్రించాలని గడివేముల మండల వాసులు కోరుతున్నారు.. అయినా తెలుగులో ఒక సామెత ఉంది ఆ సామెత గడివేముల పంచాయతీ అధికారులకు సరిగ్గా సరిపోతుంది.. అయినా ఎప్పుడు స్పందించారని ఇప్పుడు స్పందిస్తారు.. చూద్దాం.