ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పల్లెవెలుగు వెబ్, ఆత్మకూరు: ప్రతి పేద వాడికి ఇల్లు కట్టివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దుద్యాల రోడ్డు నందు RDT కాలనీ దగ్గర ప్రభుత్వం పేద వారికి ఇచ్చిన 1147 ఇంటి నిర్మాణాలకు ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తరువాత మైనారిటీ కాలనీ నందు 755 ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ డి టి కాలనీలో పట్టాలు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని లేనియెడల కొత్తవారికి కేటాయిస్తామన్నారు. ఆర్ డి టి కాలనీ కి ఇప్పటికి కోటి రూపాయల వరకు ఖర్చు చేశామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కాలనీ నందు లబ్ధి పొందిన పట్టాదారులు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా, హౌసింగ్ , మునిసిపాలిటీ అధికారులు, మున్సిపల్కౌన్సిలర్లు , వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.